రెండు నెలలుగా ICUలో పోరాడుతున్న శ్రీతేజ్.. పుష్ప మూవీ టీమ్ కీలక నిర్ణయం?

by Gantepaka Srikanth |
రెండు నెలలుగా ICUలో పోరాడుతున్న శ్రీతేజ్.. పుష్ప మూవీ టీమ్ కీలక నిర్ణయం?
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా(Pushpa 2 Movie) విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్(Sri Tej) తీవ్రంగా గాపయడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రెండు నెలలుగా ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. అయితే, తాజాగా డాక్టర్లు బాలుడ్ని విదేశాల్లో చూపించాలని పుష్ప-2 చిత్రబృందానికి సూచించారట. డాక్టర్ల నుంచి ఫోన్ రాగానే.. నిర్మాత బన్నీ వాస్(Bunny Vas) స్వయంగా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారట. వైద్యుల సూచన మేరకు పరిస్థితి ముదరకముందే.. శ్రీతేజ్‌ను విదేశాలకు తరలించాలని చిత్రబృందం నిర్ణయించిందట. దీనిపై మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కాగా, సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్‌ను తల్లిని కోల్పోయాడు. హీరోను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి శ్రీతేజ్ తల్లి అక్కడికక్కడే మృతిచెందారు. బాధిత కుటుంబానికి ఇప్పటికే చిత్రబృందం రూ.2 కోట్ల వరకు పరిహారం ప్రకటించింది. బాలుడికి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. శ్రీతేజ్ తండ్రికి ఉద్యోగం ఇప్పిస్తామని నిర్మాత దిల్ రాజు(Dil Raju) హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని మూవీ టీమ్ అధికారికంగానే ప్రకటించింది. తాజాగా మరో నాలుగు నిమిషాలు యాడ్ చేసి.. పుష్ప-2 రీలోడెడ్‌ వెర్షన్‌ అంటూ మొత్తం 3.44 గంటల నిడివితో మరోసారి సినిమాను విడుదల చేశారు. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్‌ (Sukumar) ఈ సినిమాను తెరకెక్కించారు. రష్మిక (Rashmika) కథానాయికగా నటించింది. సునీల్, రావు రమేశ్, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటించారు.

Next Story