- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్సై
by Kalyani |

X
దిశ, ఏన్కూర్: యువతను బెట్టింగ్ యాప్స్ వంటి వ్యసనాల నుండి దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలని ఏన్కూర్ ఎస్సై ఎస్ కే రఫీ తెలిపారు. ఈ వ్యసనాలు సరదాగా మొదలై, క్రమంగా అప్పుల ఊబిలోకి దారితీసి, ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవచ్చని ఆయన యువతను హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగాన్ని గమనించాలని, అవసరానికి మించిన డబ్బులు ఇవ్వకూడదని ఆయన సలహా ఇచ్చారు. బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, మొబైల్ ఫోన్లలో బెట్టింగ్ యాప్స్ ఉన్నట్లు తేలితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై రఫీ స్పష్టం చేశారు. ఇటువంటి కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని, డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Next Story