- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL లైవ్ చూస్తూ బస్ డ్రైవింగ్.. చివరికి ఏమైందంటే?(వైరల్ వీడియో)

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఇవాళ(ఆదివారం) ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. క్రికెట్ ప్రియులు తమ అభిమాన జట్లు ఆడబోయే మ్యాచ్‌ల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ క్రమంలో నే చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌ను చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్న అభిమానులు మ్యాచ్ ప్రారంభమవ్వగానే ఫోన్‌లో చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ బస్సు డ్రైవర్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు.
ఈ తరుణంలో ప్రయాణికుల భద్రత మరచి.. ఫోన్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ నిర్లక్ష్యంగా బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడిని విధుల నుంచి తొలగించారు. మహారాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై పుణె మార్గంలో ఎంఎస్ఆర్టీసీ ‘ఈ-శివనేరీ’ బస్సులో డ్రైవర్ ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు. ఈ ఘటనను గమనించిన ప్రయాణికుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో పై స్పందించిన అధికారులు వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు.