కత్రినా కైఫ్ బాడీ గార్డ్‌ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

by Hamsa |   ( Updated:2023-10-19 11:10:18.0  )
కత్రినా కైఫ్ బాడీ గార్డ్‌ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక తెలుగులో ‘మల్లీశ్వరి’ మూవీతో పరిచయం అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు టైగర్-3 సినిమాతో రాబోతుంది. ఇక పారితోషికంగా భారీగా తీసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా, కత్రినా కైఫ్‌ బాడీ గార్డ్ జీతం గురించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ అమ్మడి బాడీ గార్డ్ పేరు దీపక్ సింగ్ అని సమాచారం. ఇక అతని జీతం ఏడాదికి కోటి రూపాయలని తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన వారు మాత్రం షాక్ అవుతున్నారు. కత్రినా కైఫ్ జనాల్లోకి రావాలంటే ఆ రేంజ్‌లో పారితోషికం ఇచ్చి బాడీ గార్డ్‌ను పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story