Karthika Deepam: అబద్ధాలు చెప్పకంటూ జ్యో మీద ఫైర్ అయిన దాసు

by Prasanna |
Karthika Deepam: అబద్ధాలు చెప్పకంటూ జ్యో మీద ఫైర్ అయిన దాసు
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

ఐసీయూ నుంచి బయటికి వెళ్లి శివనారాయణ ఎటు నుంచి వచ్చేస్తాడో అని చూస్తూ ఉంటుంది. ఇక దాసు.. అప్పుడే జ్యోతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు ‘నాతో ఏం మాట్లాడాలి?’ అని జ్యో కోపంగా అంటుంది. ఏమన్నావ్ అని దాసు చాలా కోపంగా అంటాడు. ‘నాతో ఏం మాట్లాడాలి నాన్నా?’ అని నటిస్తూ ఉంటుంది. ‘అది అలా పిలువు.. మర్యాదగా ఉంటుంది.. అయినా నేను నీతో మాట్లాడుతుంది .. నాన్నా అని పిలిపించుకోవడానికో.. లేక నీ మీద ప్రేమ కురిపించుకోవడానికో కాదు.. నీకు వార్నింగ్ ఇవ్వడానికి మాత్రమే..ఇక్కడికి వచ్చాను ’ అని దాసు అంటాడు.ఆ మాటలకూ జ్యో షాకవుతోంది.

'నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేంతలా నేనేం చేశాను నాన్నా’ అంటుంది జ్యో. అసలు ‘నువ్వు ఆసుపత్రికి ఎందుకొచ్చావ్?’ అని దాసు అంటాడు. నేను ‘బావ కోసం’ కోసం వచ్చా అని జ్యో అంటుంది . సరే , అయితే ‘యాక్సిడెంట్ ఎందుకు చేశావ్?’ అని దాసు సీరియస్ గా అడుగుతాడు. ‘బ్రేక్ పడలేదు’ అని జ్యో నీరసంగా అంటుంది. నీ ఆటలు ఎక్కడైనా ఆడు .. నా దగ్గర మాత్రం ఆడకు .. ‘బ్రేక్ పడలేదని అబద్దం చెప్పకు .. ఈ స్టాండ్ తీసుకుని తల మీద గట్టిగా కొడతా.. ఆ తర్వాత ఇంకోసారి రక్తమిస్తాను.. పద్దతి మార్చుకో జ్యోత్స్నా’ అని దాసు అంటాడు. ‘ఇప్పుడు నేనేం చేశాను’ అని అంటుంది జ్యో. ‘నేను నీకు మాట ఇచ్చాను.. నేను ఇచ్చిన మాట మీద నిలబడుతుంటే నువ్వు అలాగే నిలబడాలి కదా?’ అంటాడు దాసు ఆవేశంగా. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Advertisement

Next Story