Jr.NTR : సైఫ్ పై జరిగిన దాడిని ఖండించిన జూ.ఎన్టీఆర్

by M.Rajitha |
Jr.NTR : సైఫ్ పై జరిగిన దాడిని ఖండించిన జూ.ఎన్టీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడు నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై జరిగిన దాడిపై జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) స్పందించారు. దాడి విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని పేర్కొన్నారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు. కాగా గురువారం తెల్లవారు జామున సైఫ్ అలీఖాన్ మీద బాంద్రా(Bandra)లోని ఆయన నివాసంలో ఓ అగంతకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆరుచోట్ల కత్తిపోట్లకు గురికాగా, ప్రస్తుతం లీలావతి ఆసుపత్రి(Leelavathi Hospital)లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలపాలైన సైఫ్ పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం.

Next Story

Most Viewed