ఎన్టీఆర్‌ ఎంత కోపంలో ఉన్నా ప్రణతి అలా పిలవడంతో కూల్ అవుతాడట?

by Hamsa |   ( Updated:2023-08-05 06:04:13.0  )
ఎన్టీఆర్‌ ఎంత కోపంలో ఉన్నా ప్రణతి అలా పిలవడంతో కూల్ అవుతాడట?
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సిరిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. తారక్, లక్ష్మీ ప్రణతి 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే లక్ష్మీ ప్రణతి ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ మరోవైపు తన పర్సనల్ పనులు పూర్తి చేస్తుంది.

ఇలాంటి క్రమంలో ఎంతో పద్ధతిగా ట్రెడిషనల్‌గా ఉండే లక్ష్మీ ప్రణతి ఇంట్లో ఎన్టీఆర్‌ను ఏమని పిలుస్తుందోనన్న ప్రశ్న అందరిలో వస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకారం.. ఎన్టీఆర్‌, ప్రణతితో చాలా ఫ్రెండ్లీగా రొమాంటిక్‌గా.. సరదా సరదాగా ఉండారట. అంతేకాకుండా ప్రణతి సైతం తారక్‌పై జోక్స్ వేస్తూ కౌంటర్ వేస్తుందట. అయితే లక్ష్మీ, ఎన్టీఆర్‌ను ప్రేమగా బావ అని పిలుస్తుందట. ఎన్టీఆర్‌ ఎంత కోపంగా ఉన్నా భార్య అలా పిలవడంతో కూల్ అవుతాడని తెలుస్తోంది. వారి నిశ్చితార్థం అయినప్పటి నుంచే తారక్ బావ అని పిలవమని చెప్పాడట. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు మిమ్మల్ని చూసి అయినా మారాలి అని అభిప్రాయపడుతున్నారు.

Read More:

ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. సినీ రంగంలో, రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న Manchu Manoj

Advertisement

Next Story