- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Siddharth: నేను అలాంటి చిత్రాలు చేసుంటే స్టార్ హీరోను అయ్యేవాడిని.. సిద్ధార్థ్ సెన్సేషనల్ కామెంట్స్

దిశ, సినిమా: హీరో సిద్ధార్థ్(Siddharth) ‘బాయ్స్’ సినిమాతో పరిచయం అయి.. వరుసగా ప్రేమకథ చిత్రాలతో విభిన్న స్టోరీలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. లవర్ బాయ్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ ఏడాది పాటు సినిమాలు దూరం అయ్యారు. మళ్లీ ‘టక్కర్’(Takkar) రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన 2023లో ‘చిన్ని’మూవీతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గత ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) ‘ఇండియన్-2’(Indian-2)చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ హిట్ అందుకోలేకపోయింది.
అంతేకాకుండా ట్రోల్స్‌ను ఎదుర్కొంది. ఇటీవల ‘మిస్ యు’(Miss you)తో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ ‘ఇండియన్-3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘స్త్రీల చెవుల కింద వాయించడం.. పాటలు పాడడం స్త్రీ నడుముపై చిటికెలు వేయడం.. స్త్రీకి ఏమి చేయాలో.. ఎక్కడికి వెళ్లాలో చెప్పే స్క్రిప్టులు నా దగ్గరకు వచ్చాయి. అలాంటి స్క్రిప్టులను నేను నేరుగా రిజెక్ట్ చేశాను. నాకు ఆ నేచర్ లేకపోతే, అలాంటి సినిమాలు నేను చేసి ఉంటే ఈపాటికి పెద్ద స్టార్ హీరోను అయ్యేవాడని. కానీ నేను ఎక్కువగా ఇష్టపడే దానిపై దృష్టి పెట్టాను.
నా దగ్గరకు వచ్చిన ఆడవాళ్లతో నేను గౌరవంగా ఉండేవాడిని, తల్లిదండ్రులతో, పిల్లలతో బాగానే ఉండేవాడిని, అది నన్ను క్యూట్‌గా చూపించిందని చెబుతుంటారు. 15 ఏళ్ల క్రితం నా సినిమాలను వాళ్ల పిల్లలు చూడగలరు. ఫీలింగ్ చాలా సంతృప్తికరంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ కామెంట్స్ నెట్టింట సెన్సేషనల్‌గా మారాయి. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. సిద్ధార్థ్, అతిదిరావు హైదరీ(Atidirao Hydari) ప్రేమించుకుని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ప్రజెంట్ సిద్దు, అతిదితో వెకేషన్స్‌కు వెళ్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.