- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fahad Fazil: ఆ సినిమా చేసినందుకు ఇప్పటికి బాధ పడతాను.. ‘పుష్ప’ విలన్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘పుష్ప’ (Pushpa)లో పోలీస్ క్యారెక్టర్ (Police Character)లో కనిపించి ‘పార్టీ లేదా పుష్ప’ అనే డైలాగ్‌తో విలనిజానికే ఓ ప్రత్యేక స్టైల్‌ను పరిచయం చేసిన ఈయన.. ఇప్పుడు ‘పుష్ప-2’ (Pushpa-2) తో కూడా అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక ఒకపక్క హీరోగా.. మరోవైపు విలన్‌గా అదరగొడుతున్న ఫహద్ ఫాజిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొని ‘మామన్నన్’ అనే సినిమాలో నటించినందుకు ఇప్పటికి బాధ పడుతున్నా అని కామెంట్స్ చేశారు.
‘‘మామన్నన్’ (Mamannan) సినిమా కథ నచ్చే పాత్ర ఒప్పుకున్నాను. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఆ మూవీ ఎందుకు చేశానా అని చాలా సార్లు బాధ పడ్డాను. అందులో నేను విలన్ (villain)గా నటించగా.. కుక్కల్ని క్రూరంగా చంపుతాను. కానీ నిజానికి నాకు చిన్నప్పట్నుంచి కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే ఆ సినిమాలో నన్ను నేను చూసుకుని ఏడ్చేసాను. అందుకే ఆ సినిమా ఎందుకు చేశానా అని ఫీల్ అవుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఉదయనిధి స్టాలిన్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మామన్నన్’ మూవీలో ఫహద్ ఫాజిల్ నెగిటివ్ రోల్‌లో నటించి మెప్పించాడు. అంతే కాకుండా ఈ పాత్రకు గాను ఆయనకు పలు అవార్డులు కూడా వచ్చాయి.