- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మా అమ్మను కాపాడిన మెగాస్టార్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.. బాలయ్య బ్యూటీ కన్నీటితో ఎమోషనల్ కామెంట్స్

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు పలు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో చిందులేసి ఫుల్ ఫేమస్ అయింది. ఇటీవల ఈ భామ బాలయ్య(Balakrishna)తో ‘డాకు మహారాజ్’(Daku Maharaj)లో దబిడి దిబిడే(Dabidi Dibide) సాంగ్‌కి డ్యాన్స్ చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఈ పాట హిట్ కంటే ట్రోలింగే ఎక్కువ జరిగింది. ఇదిలా ఉంటే..ఇటీవల ఊర్వశి తల్లి మీను రౌతేలా(Meenu Rautela) ఎడమ కాలిలో ఇంట్రా - ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్‌తో ఆస్పత్రి పాలయ్యారు. ఇదెంతో ప్రమాదకరమని డాక్టర్లు చెప్పగా ఊర్వశి.. చిరంజీవి(chiranjeevi)ని సంప్రదించి సహాయం కోరారు.
వెంటనే స్పందించిన మెగాస్టార్.. కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో డాక్టర్ల బృందంతో మెరుగైన వైద్యం అందేలా చేశారు. సర్జరీ అనంతరం ఊర్వశి తల్లి సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీనిపై స్పందించిన బోల్డ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారి సేవా కార్యక్రమాల గురించి ఎంతో విన్నాను. వాల్తేరు వీరయ్య షూటింగ్‌లో ఆపదలో ఉన్న వారికి నేను చూస్తుండగానే ఎంతో సాయం అందించారు. ఆ సాయం నా వరకూ వచ్చింది. అమ్మ కాలి ఎముకకు పెద్ద సమస్య వచ్చింది.
మొహమాటంగా చిరంజీవి గారి సాయం కోరాను. వెంటనే స్పందించిన ఆయన కోల్‌కతాలోని డాక్టర్లతో మాట్లాడి అమ్మకు సర్జరీ చేయించారు. అనంతరం మీ అమ్మ బాగానే ఉన్నారు, ఆమె ఆరోగ్యంగా ఉంటారు.. అని ఆయన చెప్పిన మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ అండగా నిలిచారు. ఏ అవసరం వచ్చినా అడగడానికి మొహమాట పడొద్దన్నారు.
భూమ్మీద ఇంకా మంచితనం, మానవత్వం బతికే ఉందని నిరూపించారు. అందుకే ఆయన్ను దేవుడిగా, మా శక్తికి లైట్‌హౌస్‌గా భావిస్తాను' అని ఊర్వశి భావోద్వేగానికి గురయ్యారు. కాగా, నటి ఊర్వశి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'(Valtheru Veeraiah) సినిమాలో 'బాసూ వేర్ ఈజ్ ద పార్టీ' సాంగ్‌లో స్టెప్పులతో సందడి చేసిన సంగతి తెలిసిందే.