- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి ఐశ్వర్యం మాత్రం నా భార్యకే ఉంది.. అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే ఇటీవల ‘పుష్ప’ సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే డైరెక్టర్ త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అప్పట్లో త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య సాన్నిహిత్యం ఉండటం వల్ల వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందట. అప్పుడు అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సంపద వేరు ఐశ్వర్యం వేరు ఎందుకంటే సంపద అంటే మనం సంపాదించిన ఆస్తిపాస్తులు.. కానీ ఐశ్వర్యం అంటే అది కేవలం సుఖం మాత్రమే అంటూ త్రివిక్రమ్ చెప్పారు. దీనికి బన్నీ స్పందిస్తూ.. అయితే ఐశ్వర్యం అనేది ఎక్కువగా అబ్బాయిల కంటే అమ్మాయిల దగ్గరే ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్‌లో మేకప్‌కి సంబంధించిన వస్తువులు ఉంటాయి’’ అని చెప్పుకొచ్చాడట.
ఆ తర్వాత త్రివిక్రమ్ అవునవును ఇలాంటి ఐశ్వర్యం ఉండాలంటే చాలా అదృష్టవంతులై ఉండాలని అన్నారట. ఆ తర్వాత బన్నీ ‘‘అవును నేను సంపాదిస్తున్నాను నా దగ్గర సంపద మాత్రమే ఉంది. కానీ నా భార్య దగ్గర ఐశ్వర్యం ఉంది. అంటూ అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ పరోక్షంగా తన భార్య స్నేహ రెడ్డి కి కూడా మేకప్ అంటే పిచ్చి ఇష్టమని మేకప్ పిచ్చిది అంటూ ఇండైరెక్టుగా చెప్పాడని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.