ఆయన కోసమైనా ఈ మూవీ చూస్తారని భావిస్తున్నా: రాహుల్ యాదవ్

by Hamsa |
ఆయన కోసమైనా ఈ మూవీ చూస్తారని భావిస్తున్నా:  రాహుల్ యాదవ్
X

దిశ, సినిమా: మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్(Swadharm Entertainment) నుంచి ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam) అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్(Raja Gautam) ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్(Umesh Kumar) సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ‘‘తాత, మనవడు రిలేషన్, కథ నాకు బాగా నచ్చింది.

మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా తాత కూడా నన్ను సక్సెస్ ఫుల్‌గా చూడాలని అనుకున్నారు. కానీ మళ్లీ రావా టైంలోనే ఆయన స్వర్గస్తులయ్యారు. మా తాత గారికి నివాళిలా ఈ సినిమా ఉంటుందని కథకు ఓకే చెప్పా. అయితే బ్రహ్మానందం నటించకపోతే ఈ సినిమా తీయలేం. అదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పాం. కథ విన్న తరువాత బ్రహ్మానందంకి కూడా చాలా నచ్చింది. ఇంత వరకు ఆయన్ను చూడనటువంటి పాత్రల్లో, ఎమోషన్స్‌లో చూస్తారు. సినిమాని కొన్ని లెక్కలతో తీస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నామో తెలుసుకోవాలి.

లిమిటెడ్‌ బడ్జెట్‌తో, తక్కువ రోజుల్లో మూవీ చేస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. నాకు పెద్ద లాభాలు రావాలని కూడా ఉండదు. పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకుంటా. కోటి మంది ఆడియెన్స్ ఉన్నారనుకుంటే.. వంద రూపాయలు సగటు అనుకుంటే.. వంద కోట్ల కలెక్షన్స్ వస్తాయి.. కానీ నాకు ఆ వంద కోట్లు అవసరం లేదు. నాకు ఓ ఇరవై కోట్లు వచ్చినా చాలు. బ్రహ్మా ఆనందం సినిమా విషయానికి వస్తే నేను హిట్లు, ఫ్లాపు గురించి చెప్పను. ఈ మూవీకి అందరూ బ్రహ్మానందం కోసం వస్తారు. కానీ ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం రాజా గౌతమ్‌ను తీసుకెళ్తారు. అతని పర్ఫామెన్స్, యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారు. అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తారు. ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని చెప్పుకొచ్చారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed