Tamannaah Bhatia: నేనేం ఐటమ్ గర్ల్‌ను కాదు.. అసహనం వ్యక్తం చేసిన తమన్నా

by Hamsa |
Tamannaah Bhatia: నేనేం ఐటమ్ గర్ల్‌ను కాదు.. అసహనం వ్యక్తం చేసిన తమన్నా
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) వరుస సినిమాలతో హిట్స్ అందుకుంటూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. అంతేకాకుండా వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తూ రెచ్చిపోతుంది. అంతటితో ఊరుకోకుండా ఐటమ్ సాంగ్స్‌లో కూడా మెరుస్తూ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఏడాదిలో తమన్నా జైలర్, స్త్రీ-2 వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. దీంతో దర్శక, నిర్మాతలు తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సినిమా హిట్ అవుతుందని భావించి ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను చేసిన పాటలు ఆ సినిమాల సక్సెస్‌లకు హెల్ప్ అవడం ఆనందగానే ఉంది. అందుకని వరుసగా ఐటమ్ నంబర్లే చేయమంటే ఎలా? ‘జైలర్’(Jailer) రజినీకాంత్(Rajinikanth) సినిమా అవడంతో ఇష్టంతో చేశాను. అలాగే ‘స్త్రీ-2’(Stree-2) డైరెక్టర్ అమర్ కౌశిక్(Amar Kaushik) నాకు మంచి ఫ్రెండ్. తను అడిగాడని మాట కాదనలేక చేశా. అంతే తప్ప అదే పనిగా అలాంటి పాటలు చేయడానికి నేనేం ఐటమ్ గర్ల్‌ని కాదు’’ అని అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తమన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed