Allu Arjun: 2024 లో మొత్తం అల్లు అర్జున్‌పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయి?

by Anjali |   ( Updated:2024-12-14 05:08:08.0  )
Allu Arjun: 2024 లో మొత్తం అల్లు అర్జున్‌పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయి?
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్‌(Allu Arjun) జైలుకు పోవడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బన్నీ వార్తలే వినిపిస్తున్నాయి. హైదరాబాదు(Hyderabad)లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రజెంట్ అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు రాగా.. తర్వాత ఏం జరగనుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు(Prominent political leaders), సినీ సెలబ్రిటీలు(Popular movie celebrities)(కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బొత్స సత్యనారాయణ.., అడవి శేష్, నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా, పలువురు హీరోయిన్లు).. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ, మద్ధతుగా నిలిచారు.

ఈ క్రమంలో బన్నీ గురించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది(2024)లోనే అల్లు అర్జున్ పై మూడు కేసులు నమోదవ్వడం బాధాకరమంటూ ప్రజలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఎలక్షన్స్ సమయంలో ఈ హీరో.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డి(Shilpa Ravichandra Reddy)ని కలిసేందుకు వెళ్లగా.. అక్కడ ఈయనపై 144 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆర్మీ(Army) అని పెట్టి సైన్యాన్ని అవమానపరుస్తున్నారు అంటూ గ్రీన్ పీస్ ట్రస్ట్‌(Green Peace Trust)కు చెందిన శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) కూడా అల్లు అర్జున్‌పై కేసు పెట్టారు. ఇప్పుడు సంచలనంగా మారిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన ఒకటి. ఇలా ఈ నటుడిపై మొత్తం మూడు కేసులు నమోదవ్వడం అల్లు అర్జున్‌కు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read More : రాత్రంతా మేల్కొనే ఉన్న అల్లు అర్జున్.. జైలు అధికారులను పదే పదే ఏం అడిగారో తెలుసా?

Advertisement

Next Story