- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Dhanush-Venky Atluri: మరోసారి హిట్ కాంబో రిపీట్.. సినిమా టైటిల్ ఏంటంటే? (ట్వీట్)

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) గత ఏడాది రాయన్(Raayan), కెప్టెన్ మిల్లర్(Captain Miller) వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ధనుష్ పలు చిత్రాలకు నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా హీరోగా కుబేర, ఇడ్లీ కడై(Idli Kadai) వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీస్ త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఓ వార్త వైరలు అవుతోంది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri)తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.
దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ధనుష్-వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న సినిమాకు ‘హానెస్ట్ రాజ్’(Honestraj) అని పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న ధనుష్ అభిమానులు సూపర్ హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ ఇప్పటికే ‘తిరు’ చిత్రం చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.