Varalakshi: భర్త బర్త్ డే సందర్భంగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఆసక్తికర పోస్ట్

by Anjali |
Varalakshi: భర్త బర్త్ డే సందర్భంగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ వరలక్షి శరత్ కుమార్(Heroine Varalakshi Sarath Kumar) ఈ ఏడాది(2024) జూలై 3 వ తేదీన థాయ్ లాండ్‌(Thailand)లో నికోలై సచ్ దేవ్‌(Nicolai Such Dev)ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. అయితే నేడు నటి వరలక్ష్మి భర్త పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ హీరోయిన్ సోషల్ మీడియా వేదికన ప్రత్యేకంగా ఓ పోస్ట్ పెట్టింది. ‘ఈ ఏడాది చాలా ఫాస్ట్‌గా గడిచిపోయిందని తెలిపింది. అలాగే చాలా జరిగాయని.. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని మంచి మెమోరీస్ ఉన్నాయని వెల్లడించింది.

ఇన్నేళ్ల నుంచి నువ్వు నీలాగా ఉన్నావని.. ఇందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటూ పేర్కొంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఈ ఒక్క నిమిషం సరిపోదని, నీతో ప్రయాణిస్తున్నందకు చాలా హ్యీపీగా ఉందని వివరించింది. నీలాంటి హస్బెండ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని.. ఇంతకంటే నేను నిన్ను ఎక్కువ ఏం అడగలేనంటూ వరలక్ష్మి పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా భర్త బర్త్ డే సందర్భంగా పలు ఫొటోలు కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story