Hero Nikhil : సముద్ర తీరాన..కొడుకుతో హీరో నిఖిల్ సందడి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-04 06:25:24.0  )
Hero Nikhil : సముద్ర తీరాన..కొడుకుతో హీరో నిఖిల్ సందడి
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్(Hero Nikhil)తన కుటుంబంతో కలిసి సముద్ర తీరాన (Beach) చిల్ అవుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న హీరో నిఖిల్ కు కాస్త సమయం దొరకడంతో తన కొడుకు ధీర, భార్య పల్లవి వర్మతో కలిసి సముద్ర అనుభూతిని అస్వాదించేందుకు పేరుపాలెం బీచ్‌‌‌కు వెళ్లారు. భార్య పల్లవి వర్మ, కొడుకుతో బీచ్‌లో ఆడుకున్న వీడియోను ఆయన షేర్ చేశారు. 'ధీర సముద్రపు తొలి స్పర్శ' అని ఆయన రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'హ్యాపీ డేస్' సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు సినిమాల్లో నటించాడు. అష్టాచెమ్మా, కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ 'స్వయంభూ' షూటింగ్ లో బిజీగా ఉన్నారు.. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed