SSMB28 అప్‌డేట్.. మళ్లీ తెరపైకి ఆ స్టార్ హీరో పేరు..??

by Disha News Desk |
SSMB28 అప్‌డేట్.. మళ్లీ తెరపైకి ఆ స్టార్ హీరో పేరు..??
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని మాత్రం క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్‌ను ఢీ కొట్టేందుకు మరో స్టార్ హీరోను తీసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అది కూడా ఎవరినో కాదు. తమిళ స్టార్ హీరో విక్రం. మూవీ మేకర్స్ ఎస్ఎస్ఎంబీ28లో విలన్ పాత్ర కోసం విక్రంను సంప్రదించారని, ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్‌‌లో తెరకెక్కించేందుకు త్రివిక్రమే ఈ ప్లాన్ చేశాడని నెట్టింట వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా విక్రం మేనేజర్ ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. మహేష్ మూవీలో విక్రం పాత్రపై క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పాడు. 'మహేష్ చేస్తున్న ఏ ప్రాజెక్ట్‌లోనూ విక్రం నటించడం లేదు. వస్తున్న వార్తలన్నీ అబద్దాలు' అని సూర్యనారాయణ్ తన ట్వీట్‌లో చెప్పాడు. ఈ ట్వీట్‌తో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. దీంతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. మహేష్, త్రివిక్రమ్ మూవీలో విలన్‌గా ఎవరు చేస్తారంటూ చర్చలు వస్తున్నాయి. మరి దీనిపై మూవీ టీం త్వరలో ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Advertisement

Next Story