- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోనసీమలో ఆ హీరోయిన్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రొమాన్స్.. ఫొటోలు వైరల్
దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) నటిస్తున్న తాజా చిత్రం ‘భైరవం’(Bhairavam). విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohith) ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. హై వోల్డెజ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘భైరవం’ నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన మరో అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రజెంట్ ఈ చిత్రానికి సంబంధించి తాజా లవ్ సాంగ్‌ను కోనసీమ అందాల నడుమ షూట్ చేస్తున్నారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అదితి శంకర్ (Athidi Shankar)మధ్య జరిగే రొమాంటిక్ సీన్స్‌ను చిత్రీకరిస్తుండగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను త్వరలో ఇవ్వనున్నారు చిత్ర బృందం.