Srimukhi: ‘టాలెంటెడ్ హీరోకు పుట్టినరోజుకు శుభాకాంక్షలు’.. నానిని హగ్ చేసుకున్న ఫొటో పంచుకున్న యాంకర్

by Anjali |
Srimukhi: ‘టాలెంటెడ్ హీరోకు పుట్టినరోజుకు శుభాకాంక్షలు’.. నానిని హగ్ చేసుకున్న ఫొటో పంచుకున్న యాంకర్
X

దిశ, వెబ్‌డెస్క్: టైమింగ్ పంచులతో, మాట తీరుతో బుల్లితెర, వెండితెరపై ఫుల్ క్రేజ్ దక్కిచుకుంది యాంకర్, అల్లరి పిడుగు శ్రీముఖి (Srimukhi). ఈ బ్యూటీ గురించి పరిచయం అక్కర్లేదు. తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని తన మాటలతో ఆకట్టుకుంటుంది. ఓ వైపు యాంకరింగ్ (Anchoring) చేస్తూనే మరోవైపు ఈ భామ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించి జనాల్ని అలరిస్తుంది. రామ్ పోతినేని (Ram Pothineni), అల్లు అర్జున్ (Allu Arjun)వంటి హీరోల సినిమాల్లో నటించింది.

అలాగే ఏకంగా టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) భోళా శంకర్ (Bhola Shankar) సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో వీరిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) అండ్ భూమిక నటించిన ఖుషి సినిమా(Khushi movie)లోని నడుము సీన్ ను చిరంజీవి-శ్రీముఖి చేశారు.ఇకపోతే ఈ బ్యూటీ నేడు నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలియజేసింది.

తన ఇన్‌స్టామ్ స్టోరీలో నానిని హగ్ చేసుకున్న ఫొటో పెట్టి.. టాలెంటెడ్ హీరోకు హ్యాపీ బర్త్ డే అని రాసుకొచ్చింది. ఈ స్టోరీ వీక్షించిన నెటిజన్లు నానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ పిక్ చూస్తుంటే శ్రీముఖి యాంకరింగ్ చేస్తోన్న ఏదో షోకు నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) అటెండ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి వీరిద్దరి ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Next Story

Most Viewed