- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gaddar: గద్దర్ నటించిన ఆఖరి చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే..
దిశ, వెబ్‌డెస్క్: స్మగ్లర్లను హీరోలుగా చూపించే సినిమాలకంటే, సమాజానికి మేలు చేసే సినిమాలను ప్రజలు ఆదరించాలని ఉక్కుసత్యాగ్రహం చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు సత్యారెడ్డి కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ‘ఉక్కుసత్యాగ్రహం’ చిత్రాన్ని నిర్మించానని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సినిమాను తెరకెక్కించానని, ప్రపంచ వ్యాప్తంగా 300 థియేటర్లలో ఉక్కు సత్యాగ్రహం సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత, దర్శకుడు సత్యారెడ్డి వెల్లడించారు. ‘ఉక్కు సత్యాగ్రహం’ ఆడియోను గద్దర్ చేతుల మీదుగా విడుదల చేయడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. ఈ చిత్రాన్ని సత్యారెడ్డి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందించారు.
ఇందులో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష, గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి చిత్రాలను నిర్మించిన సత్యారెడ్డి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రముఖ ఉద్యమ నేత గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఉక్కుసత్యాగ్రహం. ఈ సినిమాలో అయన ఓ పాట రాసి ఆలపించారు. అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించారని ఆరోపణలు రావడంతో పాటు గద్దర్ మరణంతో సినిమా విడుదల, సెన్సార్ ఆలస్యం అయ్యాయి. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, ప్రైవేటికరణకు వ్యతిరేకంగా పోరాడేవారు ఈ సినిమాలో నటించారు. గద్దర్ సినిమాలో అరగంట పాటు తెరపై కనిపిస్తారు’’ అని చెప్పారు. అలాగే ఈ సినిమాతో గద్దర్‌కు నివాళి అర్పిస్తున్నామని సత్యారెడ్డి పేర్కొన్నారు.