విజయ్ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీల అవుట్.. ఆమె స్థానంలో ఎవరంటే?

by Hamsa |   ( Updated:2023-09-26 08:54:22.0  )
విజయ్ దేవరకొండ మూవీ నుంచి  శ్రీలీల అవుట్.. ఆమె స్థానంలో ఎవరంటే?
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన 12వ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఇందులో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకున్నప్పటికీ, కారణం ఏంటో కానీ రీసెంట్‌గా ఆమె మూవీ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలోకి నటి రష్మిక మందన్నను ఓకే చేసినట్లు తెలుస్తోంది. విజయ్, రష్మిక జంటకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిన విషయమే. మొత్తానికి ముచ్చటగా మూడోసారి వీరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story