Malavika Mohanan: మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నా అంటూ ‘రాజాసాబ్’ హీరోయిన్ పోస్ట్.. వైరల్‌గా అద్భుతమైన ఫొటోస్

by sudharani |
Malavika Mohanan: మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నా అంటూ ‘రాజాసాబ్’ హీరోయిన్ పోస్ట్.. వైరల్‌గా అద్భుతమైన ఫొటోస్
X

దిశ, సినిమా: మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రజెంట్.. ప్రభాస్ (Prabhas) ‘రాజాసాబ్’, కార్తీ (Karti) ‘సర్దార్-2’, మోహన్ లాల్ (Mohan Lal) ‘హృదయపూర్వం’ (Hrudayapurvam) వంటి చిత్రాలతో బిజీగా ఉంది. ఇందులో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ‘హృదయపూర్వం’ చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హీరోయిన్ మాళవిక మోహనన్ తన సోషల్ మీడియా అకౌంట్ X వేదికగా తెలియజేస్తూ.. ‘ఈ మంత్ ఎంతో మంచిగా అనిపించింది. ‘హృదయపూర్వం’ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేశాను (first schedule completed). ఒక సినిమా నుండి మరో సినిమాకి మారుతున్నప్పుడు మనం స్నేహితులను, పరిచయస్తులను, సన్నిహితులను లేదా కొన్నిసార్లు మంచి సహోద్యోగులను ఏర్పరుచుకుంటాము. కానీ ఒక సెట్ మొత్తం కుటుంబంలా చాలా అరుదుగా అనిపిస్తుంది.

ఇది నాకు అలాంటిదే. అందమైన, వెచ్చని, ఆరోగ్యకరమైన, హృదయాన్ని కదిలించేది. నా ఆత్మ చాలా తేలికగా.. సంతోషంగా ఉండేది. ఇది చాలా విలువైన అనుభూతి. మోహన్ లాల్ సర్ & సత్యన్ సర్ వంటి ప్రముఖుల నుండి చాలా నేర్చుకున్నాను. అత్యంత ప్రతిభావంతులైన కొంతమందితో కలిసి పనిచేశాను. టెక్కడిలోని అందమైన కొండలు అంట్ టీ ఎస్టేట్‌లలో ఆనందకరమైన సమయాన్ని గడిపాను. చల్లని సాయంత్రాలలో నన్ను నేను వెచ్చగా ఉంచుకోవడానికి అంతులేని లెమన్ టీలు తాగాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఇది ఇంత అందంగా ఉండటానికి కారణం మూవీ టీమ్’ అంటూ పలు ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Next Story

Most Viewed