CHENNAI: నటి కస్తూరికి రిమాండ్ విధించిన కోర్టు.. సెంట్రల్ జైలకు తరలింపు

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-17 14:40:30.0  )
CHENNAI: నటి కస్తూరికి రిమాండ్ విధించిన కోర్టు.. సెంట్రల్ జైలకు తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరి(Actress Kasthuri)కి కోర్టు రిమాండ్‌ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదివారం ఎగ్మోర్ కోర్టు(Egmore court) ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 29 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం కస్తూరిని పోలీసులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలు(Puzhal Central Jail)కు తరలిస్తున్నారు. నవంబర్ 3న చెన్నైలోని బ్రాహ్మణ సమాజ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి.. తమిళనాడులో ఉంటున్న తెలుగు ప్రజలు 300 ఏళ్ల క్రితం తమిళ రాజుల భార్యలకు సేవలు చేయడానికి వచ్చారని.. కానీ ఇప్పుడు ఆ తెలుగోళ్లే తమిళ వాళ్లమని చెప్పుకుంటూ చలామణీ అవుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పెను దుమారం రేపాయి.

Read More...

Breaking: చెన్నైకు నటి కస్తూరి తరలింపు..


Advertisement

Next Story

Most Viewed