భారీ ప్లాన్‌లో చరణ్.. అందుకే అక్కడకు ప్రయాణం..??

by Disha News Desk |
Ram Charan
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్లాన్ చేస్తున్నాడట. వరుస సినిమాలు లైన్‌లో పెట్టిన చెర్రి ఇప్పడు మరో దానిపై దృష్టి పెట్టాడట. ఈ మేరకు వార్తలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల చెర్రీ ముంబైకు తెగ ప్రయాణం అవుతున్నాడు. మాటిమాటికి ముంబైలో తేలి అభిమానులకు షాక్ ఇస్తున్నాడు. దీనిపైనే చాలా మంది సోషల్ మీడియా వేదికగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

వారిలో కొందరు బాలీవుడ్‌లో మరో మూవీ భారీగా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. మరికొందరేమో లేదు చెర్రీ తన వ్యాపార కార్యకలాపాల గురించి వెళుతున్నాడని, ముంబైలో సరికొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. త్వరలో ఈ వార్తలపై చెర్రీ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్రీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్' పూర్తి చేసుకున్న వెంటనే శంకర్ మూవీ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. తాజాగా గౌతమ్ తిన్ననూరికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా కేజీఎఫ్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా చెర్రీ చర్చలు చేస్తున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై కూడా త్వరలో క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.

Advertisement

Next Story