వరుణ్ తేజ్ పెళ్లికి టాలీవుడ్ నుంచి వెళ్ళనున్న ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా?

by Hamsa |
వరుణ్ తేజ్ పెళ్లికి టాలీవుడ్ నుంచి వెళ్ళనున్న ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కూడా హైదరబాద్‌లో జరుపుకున్నారు. నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు వరుణ్ ట్విట్టర్ వేదికగా పెళ్ళి కార్డు వీడియోను షేర్ చేశారు. చాలా కూల్ అండ్ క్లాసీ లుక్స్ తో వెడ్డింగ్ కార్డ్ ఆకట్టుకుంటుంది. నవంబర్ 5 హైదరాబాద్లోని మాదాపూర్ లో ఘనంగా రిసెప్షన్ ఇవ్వబోతున్నారట ఈ కాబోయే కొత్త జంట. అలాగే ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి చేరుకున్నారు. అయితే ఈ పెళ్లికి మెగా హీరోలు, హాజరవుతారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు అటెండ్ అయ్యే ఛాన్సెస్ లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ ఒకే ఒక్క హీరో పెళ్లికి వెళుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అతనెవరో కాదు.. నితిన్ మొదటి నుంచి అల్లు అర్జున్‌, శిరిష్‌, రామ్ చరణ్‌, వరుణ్ వంటి వారిని క్లోజ్ ఫ్రెండ్. ఇటీవల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ పార్టీకి కూడా నితిన్ హాజరయ్యాడు. ఇక ఇప్పుడు పెళ్లికి కూడా ఇటలీకి వెళ్లబోతున్నాడట.



Next Story