విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ మృణాల్ ఠాకూర్ డ్రెస్‌పై చర్చ.. డైరెక్టర్ ఆ సినిమాకు లింక్ పెట్టాడా?

by Hamsa |   ( Updated:2023-10-21 07:11:18.0  )
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ మృణాల్ ఠాకూర్ డ్రెస్‌పై చర్చ.. డైరెక్టర్ ఆ సినిమాకు లింక్ పెట్టాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్‌లో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా ఇటీవల విడుదలైంది. అయితే అందులో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ జీవితం గడుపుతున్న వ్యక్తిగా కనిపించాడు. ఇక ఇందులో మృణాల్ ఠాకూర్ కొద్ది సమయం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ గ్లింప్స్ తర్వాత జనాలందరూ ఆమె వేసుకున్న డ్రెస్ మీద చర్చలు మొదలెట్టారు.

ఎందుకంటే మృణాల్ ఠాకూర్ టీజర్ లో వేసుకున్న డ్రెస్ తో పరశురామ్.. సర్కారు వారి పాట చిత్రానికి లింక్ పెట్టాడు. ఇది అనుకోకుండా జరిగిందా లేదా అటెన్షన్ కోసం పరశురామ్ కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాడా అనేది తెలియదు. ఫ్యామిలీ స్టార్ టీజర్ లో మృణాల్ ఠాకూర్ వేసుకున్న డ్రెస్.. సర్కారు వారి పాట చిత్రంలో ఒక సంధర్భంలో కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్ ఒకేలా ఉన్నాయి. దీంతో అది చూసిన వారంతా కొంప తీసి ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్‌కు ఏమైనా లింక్ పెట్టారా? అని అనుమానపడుతున్నారు. అంతేకాకుండా కీర్తి డ్రెస్ డైరెక్టర్ పరుశురామ్‌కు అంత నచ్చిందా అని గుసగుసలాడుకుంటున్నారు.



Advertisement

Next Story