- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే.. నా ఎదుగుదల ఆ డైరెక్టర్‌కే సొంతం: అల్లు అర్జున్
దిశ, సినిమా: ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’ (Pushpa-2). ఇండియాస్ బిగ్గెస్ట్ (India's Biggest) ఫిలింగా రూపొందిన ఈ చిత్రానికి బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) దర్శకత్వం వహిస్తుండగా.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండగా.. చిత్ర ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇటీవల బీహార్ (Bihar)లోని పాట్నా (Patna)లో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నై (Chennai)లో జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్, కొచ్చిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ కాగా.. తాజాగా ముంబయ్ (Mumbai)లో 'పుష్ప-2' హీరో, హీరోయిన్ నిర్మాతలు సందడి చేశారు. అక్కడ గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా విషయంలో నేను థాంక్స్ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు.. వాళ్ల సపోర్ట్ లేకుండా ఈ సినిమా సాధ్యపడేది కాదు. నా చిన్ననాటి స్నేహితుడు నా కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్క్షతలు. త్వరలోనే పుష్ప-2 నుంచి మరో సూపర్ సాంగ్ రాబోతుంది. ఈ పాటతో దేవి మ్యాజిక్ మరో సారి తెలుస్తుంది. అందరి హృదయాలను హత్తుకునే పాట అది. ఇక ఫహాద్ ఫాజిల్, శ్రీలీల, రష్మికలతో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. నా జర్నీలో దర్శకుడు సుకుమార్‌తో 20 ఏళ్ల క్రితమే ప్రయాణం మొదలైంది. పుష్ప ఈ రోజు నేను హీరోగా ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. నన్ను స్టార్‌ను చేసింది సుకమారే. నా లైఫ్‌లో అత్యధిక భాగం.. హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది. ఈ రోజు ఆయన రాలేదు కానీ ఈ రోజు కూడా చిన్న చిన్న మార్పుల కోసం సినిమాపై ఇంకా పనిచేస్తున్నాడు. ఈ సినిమా ఇంత డబ్బు వస్తుంది.. ఇంత పేరు వస్తుందని లెక్కలు వేసుకోని చేయలేదు. ప్రేక్షకులకు ఓ బెస్ట్ సినిమా ఇవ్వాలి. వాళ్లకు గొప్ప ఎక్స్‌పీరియన్స్ సినిమా ఇవ్వాలని వర్క్ చేశాం. ఐదు సంవత్సరాలు మా లైఫ్‌లో బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. బెస్ట్ సినిమా ఇస్తున్నాం. మేము పుష్ప పార్ట్-1 సాధారణ సినిమాగానే చేశాం. కానీ ప్రేక్షకలు తమ ఆదరణతో గొప్ప సినిమా చేశారు. ఈ రోజు పుష్ప-2 రూపంలో బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా చేయడానికి కారణం మీ ఆదరణే. ఈ రోజు ప్రపంచంలోని ప్రతి దగ్గరి నుంచి, ప్రపంచంలో ప్రతి ఇండియన్, ప్రతి భాష వాళ్లు, ప్రతి రాష్రంలోని వాళ్లు అందరూ కలిసి పుష్ప-2 విడుదలను సెలబ్రేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది' అన్నారు.
Read More...
‘పుష్ప-2’ వల్ల కన్నప్ప విడుదల వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు