పోస్టర్‌లో చెయ్యి ఎవరిదో చెప్పిన శ్రీకాంత్ ఓదెల.. కానీ కాస్ట్యూమ్స్ మాత్రం.. హైప్ పెంచుతోన్న డైెరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anjali |   ( Updated:2024-12-04 16:29:41.0  )
పోస్టర్‌లో చెయ్యి ఎవరిదో చెప్పిన శ్రీకాంత్ ఓదెల.. కానీ కాస్ట్యూమ్స్ మాత్రం.. హైప్ పెంచుతోన్న డైెరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Director Srikanth Odela) అండ్ టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) జతకట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టర్ కూడా నిన్న (డిసెంబరు 3) విడుదల చేసి ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచేశారు. పోస్టర్‌లో రక్తంతో తడిసిన చేతిని చూసే ఉంటారు. కాగా ఆ చెయ్యి ఎవరిదని నెటిజన్లలో సందేహాలు తలెత్తుతున్నాయి. పోస్టర్, ఫొటోలను వీక్షించిన ఓ నెటిజన్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి వేసుకున్న బ్రాస్‌లైట్.. ఫొటోలో శ్రీకాంత్ ఓదెల చేతికున్న బ్రాస్ లైట్ ఒకటేనని భావించాడు. అలాగే పోస్టర్‌లో చూపించిన చేయి ఎవరిదని కామెంట్ చేశాడు.

తాజాగా ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీనిపై క్లారిటీ ఇచ్చారు. పోస్టర్ పరిశీలించి ఈ ప్రశ్న అడగటం నాకు ఎంతో నచ్చిందని అన్నారు. కానీ మీరు అనుకున్నట్లు అది నా చెయ్యి కాదని.. అది మన బాస్ మెగాస్టార్ చిరంజీవిదే.. చేయి చూశావా ఎంత రఫ్‌గా ఉందో అంటూ మాస్ డైలాగ్‌తో సమాధానమిచ్చారు. కానీ చిరు చేతికున్న బ్రాస్‌లైట్స్ మాత్రం నావి, నేచురల్ స్టార్(Natural Star) నానివి అని వెల్లడించారు.

Read More...

Megastar Chiranjeevi: బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో చిరు స్టన్నింగ్ ఫొటో షూట్.. యంగ్ లుక్ వైరల్


Advertisement

Next Story

Most Viewed