దగ్గుబాటి రానా షోలో బావా, మరదలి అల్లరి.. నెట్టింట ట్రెండింగ్‌గా మారిన వీడియో

by Kavitha |   ( Updated:2024-12-13 15:56:21.0  )
దగ్గుబాటి రానా షోలో బావా, మరదలి అల్లరి.. నెట్టింట ట్రెండింగ్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రానా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రానా టాక్ షో’ పేరుతో వస్తున్న ఈ షోలో ఇప్పటికే పలువురు సెలబ్రెటీస్ పాల్గొని సందడి చేశారు. ఇందులో సినిమా ముచ్చట్లు కాకుండా పర్సనల్ లైఫ్ విషయాలను రాబడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ఈ షోలో రానా, సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరూ హీరోయిన్ శ్రీలీలను ఓ ఆటాడుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిద్ధు కామెడీ టైమింగ్ చూసి షాకయ్యింది శ్రీలీల. ఇక ఆ తర్వాత రానా తన కజిన్స్‌తో ఓ ఎపిసోడ్ చేశాడు.

ఈ ఎపిసోడ్‌లో సురేష్ బాబు కూతురు.. రానా చెల్లెలు మాళవిక, రానా భార్య మిహిక హైలెట్ అయ్యారు. ఇక తన మరదలు మాళవిక పై మిహిక సెటైర్లు వేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో రానా, మిహికా, నాగ చైతన్య, మాళవిక కంటిన్యూగా మాట్లాడుతుంటే.. సుమంత్, మరొకరు సైలెంట్‌గా ఉండిపోయారు. నాగ చైతన్యను మాళవిక పదే పదే బావా బావా అని పిలుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇక దీన్ని చూసిన నెటిజన్లు బావా, మరదలి బాండింగ్ ఎంత క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed