కూతురు పేరులో తండ్రి చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వని చరణ్.. pawan kalyan పేరే ఫిక్స్

by Hamsa |   ( Updated:2023-07-02 02:18:44.0  )
కూతురు పేరులో తండ్రి చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వని చరణ్.. pawan kalyan పేరే ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్-ఉపాసన దంపతులు వివాహం జరిగిన 11 ఏళ్ల తర్వాత ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ పాప పుట్టిన రోజు నుంచే సోషల్ మీడియాలో ఏ పేరు పెడతారో అన్న చర్చ మొదలైంది. తాజాగా, జూన్ 30న చిరంజీవి మనవరాలి పేరును ట్విట్టర్ వేదికగా రివీల్ చేసి ఫ్యాన్స్‌ అతృతకు అడ్డుకట్ట వేశారు. ఆ పాపకు ‘క్లిన్ కారా’ పెట్టినట్లు వెల్లడించారు. ‘క్లిన్ కారా కొణిదెల’ షాట్ కట్‌లో kkk అని వస్తుంది. అయితే ఆ పేరు రామ్ చరణ్ పవన్ కల్యాణ్ పేరు కలిసెలా పెట్టారని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ అసలు పేరు ‘కల్యాణ్ కుమార్ కొణిదెల’ kkk ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో ఆయనను కల్యాణ్ బాబు అని పిలిచేవారు.

అలాగే మెగా స్టార్ చిరంజీవి కూడా ఆయనను ఆ పేరుతోనే పిలుస్తారని సమాచారం. ఆ సినిమా తర్వాత పవన్ కల్యాణ్‌గా మారాడు. మెగా ఫ్యామిలీలో ఫ్యాన్స్ పాపులారిటీ ఎక్కువగా ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక పవన్, నాగబాబు కలిసి చిరంజీవి సినిమాలకు నిర్మాతలుగా కూడా వ్యవహరించినట్లు సమాచారం. రుద్రవీణ నిర్మాతగా కె, కల్యాణ్ కుమార్ అని కూడా ఉంటుందట. కాగా, పవన్ కల్యాణ్ పేరునే రామ్ చరణ్ తన కూతురికి పెట్టాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మెగా ప్రిన్సెస్‌కు తన చినతాత పవన్ కల్యాణ్‌ పేరు కలిపివచ్చిందని టాక్ నడుస్తోంది. అయితే రామ్ చరణ్ చిన్నతనంలో చిరుకన్నా ఎక్కువ పవన్ వద్దే పెరిగాడు. తండ్రి కన్నా పవన్ బాబాయ్ అంటే తనకు చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఆ విషయం తెలిసిన వారు రామ్ చరణ్ కూతురి పేరులో తండ్రికి ప్రాధాన్యత ఇవ్వకుండా బాబాయ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చాడని అనుకుంటున్నారు.

Advertisement

Next Story