Brahmanandam : కొడుకు రాజ్ గౌతమ్ తో బ్రహ్మానందం కొత్త సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే.. ?

by Prasanna |   ( Updated:2025-01-02 02:17:17.0  )
Brahmanandam : కొడుకు రాజ్ గౌతమ్ తో బ్రహ్మానందం కొత్త  సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే.. ?
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ( Brahmanandam) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఆడియెన్స్ ను నవ్వించిన బ్రహ్మి ఇలా సినిమాలకు దూరంగా ఉండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే, త్వరలో కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు.

తన కొడుకు రాజా గౌతమ్ ( Raja Goutham) హీరోగా నటిస్తున్న " బ్రహ్మ ఆనందం " ( Brahma Anandam )అనే మూవీలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవితంలో తండ్రికొడుకులైన వీరిద్దరూ తాత మనవళ్లుగా కనిపించనున్నారు. ఈ మూవీ నుంచి గ్లింప్స్ కూడా విడుదల చేశారు. కొత్త ఏడాది సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ విడుదల డేట్ ను ప్రకటించారు.

బ్రహ్మ ఆనందం మూవీ 2025 ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ వైరల్ గా మారింది. ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వంలో స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాణంలో తెరకెక్కుతుంది. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ నటిస్తున్నారు. దీంతో, బ్రహ్మానందం అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. మరి, ఈ మూవీ ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed