- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi : కావ్య రాజ్ మనసులో స్థానం సంపాదించిందా?
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
కావ్య రూమ్ లోకి రాగానే.. రాజ్ ‘కళావతి’ అని పిలుస్తాడు. అప్పుడు కావ్య ఆగుతుంది. ' నిన్ను ఒకటి అడగొచ్చా? అని రాజ్ అంటాడు. ‘అడగండి’ అని కావ్య అంటుంది. ‘ఎప్పుడూ ఒకరి మీద జాలి పడే నువ్వు.. ఇప్పుడేంటి కొత్తగా ప్రవర్తిస్తున్నావ్.. అని రాజ్ అంటాడు. ఇది నేను కాదు ‘ నాలో ఉన్న మీరు అని ’ కావ్య మాట్లాడుతుంటుంది. ‘అర్థం కాలేదు’ అని రాజ్ అంటాడు రాజ్. అయ్యో మీరు అంతలా ఆలోచించకండి.. మిమ్మల్ని చూసి నేను మారాను. ఆఫీస్‌లో బాస్‌గా మీరు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు కదా .. అలాగే ఇంట్లో కూడా ఉన్నాను అని ’ అంటుంది కావ్య. ‘నువ్వు చాలా సీరియస్ గా ఉన్నావ్ .. ఇంతలా ఉండకు అందరూ తిట్టుకుంటారు’ అని రాజ్ అంటాడు.
నాకు కావాల్సింది.. మీ కుటుంబ గౌరవం.. అంతకు మించి ఇంకా ఏది వద్దు. దీని కోసం ఇప్పుడు ఇంట్లో వాళ్లకు నేను నచ్చకపోయినా నాకు ఫర్వాలేదు’ అని కావ్య అంటుంది. ‘అంటే ఇప్పటి వరకు నువు కూల్ గా ఉండి ఇప్పుడు ఇలా చేయడం వల్ల చాలా డౌట్ వస్తుందేమో’ అని రాజ్ అంటాడు. అయ్యో అలా ఏం కాదు.. నేను మొత్తం చూసుకుంటాను. తాతయ్యగారు మీ అందరి కోసమే కదా ఇంత కష్టపడింది. మనం డబ్బుని మనం ఎంతలా గౌరవిస్తే అది కూడా మనల్ని కాపాడుతుంది.. అందుకేనండి కొన్ని విషయాల్లో ఎవరు ఏమనుకున్నా నేను కొంచం కూడా పట్టించుకోవడం లేదు, త్వరగా రండి రెడీ చేస్తాను’ అనేసి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.