Bollywood: అల్లు అర్జున్‌కు బాలీవుడ్ స్టార్ హీరో సపోర్ట్

by Gantepaka Srikanth |
Bollywood: అల్లు అర్జున్‌కు బాలీవుడ్ స్టార్ హీరో సపోర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్‌పై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరమని అన్నారు. యాక్టర్ ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరు. ఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదని వరుణ్ ధావన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తొలిసారి పాన్ ఇండియా రేంజ్‌లో వరుణ్ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇవాళ శుక్రవారం బేబీ జాన్(Baby John Movie) చిత్రబృందం రాజస్థాన్‌లోని జైపూర్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో మూవీ గురించి మాట్లాడిన అనంతరం.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై వరుణ్ స్పందించి మద్దతు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed