Ram Charan: ‘గేమ్ చేంజర్’ ప్రీ- రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ (ట్వీట్)

by Hamsa |   ( Updated:2024-12-16 05:21:12.0  )
Ram Charan: ‘గేమ్ చేంజర్’ ప్రీ- రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ (ట్వీట్)
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వానీ(Kiara Advani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. దీనిని శంకర్(Shankar) తెరకెక్కిస్తుండగా.. జీ స్టూడియోస్, దిల్ రాజు(Dil Raju ) ప్రొడక్షన్‌తో కలిసి శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ- రిలీజ్(Pre-release event) వేడుక అమెరికాలో జరగనుంది. డల్లాస్‌‌లోని కర్టిస్ కల్‌వెల్ సెంటర్‌లో ప్లాన్ చేశారు. ఈ క్రమంలో.. ఈవెంట్‌కు ఎవరు గెస్ట్‌గా వస్తారనేది అందరిలో ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘గేమ్ చేంజర్’ ప్రీ-రిలీజ్‌కు గెస్ట్‌గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్ డిసెంబర్ 21న సాయంత్రం 6:00 గంటలకు జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed