Bhavani Ward 1997: చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. ప్రముఖ నిర్మాత కామెంట్స్ వైరల్

by sudharani |
Bhavani Ward 1997: చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. ప్రముఖ నిర్మాత కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన తాజా చిత్రం ‘భవానీ వార్డ్ 1997’ (Bhavani Ward 1997). జీడీ నరసింహా (GD Narasimha) దర్శకత్వం వహించిన ఈ మూవీని జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించారు. ఇందులో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండటంతో.. తాజాగా ప్రీ రిలీజ్ (Pre release) ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి (Raj kandukuri) మాట్లాడుతూ.. ‘భవానీ వార్డ్ 1997’ ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను నేనే లాంఛ్ చేశారు. సినిమా రిలీజ్‌ టైం దగ్గర పడుతుంటే టీంకు ఓ టెన్షన్ ఉంటుంది. ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశారు. అది వీళ్ల మాటల్లోనే అర్థం అవుతోంది. ఇక ఆడియెన్స్ ఇచ్చే రిజల్ట్ కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. వీళ్ల టెన్షన్ పోగొట్టేందుకు, మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు వచ్చాను. కంటెంట్ ఉన్న సినిమాలే ఇప్పుడు ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. నాకు హారర్ చిత్రాలంటే చాలా ఇష్టం. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి. ఇలాంటి సినిమాలకు మీడియా సపోర్ట్ ఇవ్వాలి. ఫిబ్రవరి 7న రాబోతోన్న ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

Next Story

Most Viewed