Mohanlal: వచ్చేసిన ‘బరోజ్’ తెలుగు ట్రైలర్.. ఎలా ఉందంటే?

by sudharani |
Mohanlal: వచ్చేసిన ‘బరోజ్’ తెలుగు ట్రైలర్.. ఎలా ఉందంటే?
X

దిశ, సినిమా: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రం ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్’(Barroz3D : Guardian of Treasure). 3Dలో తెరకెక్కుతున్న ఈ మూవీని మోహన్ లాల్ తన సొంతం నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబవూర్‌‌తో కలిసి నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ లీడ్ రోల్‌లో నటించగా.. తుహిన్ మీనన్, కల్లిర్రోయ్ టిజియాఫెటా, సీజర్ లోరెంటే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా తెలుగు ట్రైలర్‌ (Telugu trailer)ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నేను బరోజ్ ని.. వందల సంవత్సరాలుగా నిధుల్ని కాపాడుకుంటూ వస్తున్న భూతాన్ని’ అంటూ మోహన్ లాల్ ఎంట్రీతో ట్రైలర్ స్టార్ట్ కాగా.. సినిమాలోని విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్’ సినిమా క్రిస్మస్ స్పెషల్‌గా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Advertisement

Next Story