బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. ఇక పోరు మొదలు?

by sudharani |   ( Updated:2024-11-25 12:11:25.0  )
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. ఇక పోరు మొదలు?
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటిస్తున్న 109వ చిత్రం ‘డాకు మహారాజ్’(Daku Maharaj). బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి(Director Bobby Kolli) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కేవలం ప్రటనతోనే భారీ హైప్ ఏర్పటింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్(Sitara Entertainments) పతాకంపై నాగవంశీ(Nagavanshi) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ బాలయ్యబాబు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. దీంతో ‘డాకు మహారాజ్’ నుంచి వచ్చే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడు రిలీజ్ అనేది మాత్రం డేట్ రివీల్ చేయలేదు.

అయితే.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘‘డాకు మహారాజ్’ డామినేషన్‌ను చూసేందుకు కేవలం 50 రోజులు మాత్రమే ఉంది. అంతిమ పవర్ ప్యాక్డ్ మాస్ ఎక్స్‌పో ప్రపంచవ్యాప్తంగా 2025 జనవరి 12న మీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది’ అంటూ తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజెంట్ ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉండగా రిలీజ్ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.

Advertisement

Next Story

Most Viewed