- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Balakrishna: బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’ కు గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర బృందం
దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ హీరో బాలకృష్ణ ( Balakrishna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, ఈ హీరో బాబీ డైరెక్షన్ లో 109వ మూవీ ‘డాకూ మహారాజ్’ ( Daaku maharaj) చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, ఈ మూవీకి చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.
ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేయడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.అభిమానులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఈ మూవీ టీజర్ లో చూపించారు.అయితే, సంక్రాంతి పండక్కి ‘డాకూ మహారాజ్’గా బాల కృష్ణ బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని అందరు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించారు.
బాలకృష్ణ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు కొట్టి చాలా యేళ్ల తర్వాత హీరోగా హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. అంతకు ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య.. 'అఖండ' తో మంచి హిట్ అందుకున్నాడు. మరి, ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందో? లేదో చూడాల్సి ఉంది.