- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Baby Producer SKN : హీరోయిన్లపై నోరుపారేసుకున్న ప్రొడ్యూసర్.. తీరిగ్గా వివరణ

దిశ, వెబ్ డెస్క్ : 'బేబీ' సినిమా నిర్మాత ఎస్కేఎన్(Baby Producer SKN) తెలుగు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return OF The Dragon) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాట్లాడుతూ.. తమ సినిమాల్లో తెలుగురాని హీరోయిన్లను తీసుకోమని, ఎందుకంటే ఆ భాష వచ్చిన అమ్మాయిలను తీసుకుంటే ఏమవుతుందో బాగా తెలుసని.. అందుకే తెలుగు రానివారిని తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతుండటంతో.. తాజాగా ఎస్కేఎన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తను సరదా కోసం అన్న మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని తెలిపారు. వినోదం కోసం అన్న మాటలను వివాదానికి దారి తీసేలా చేయవద్దని ఆయన హితవు పలికారు. ఈ రోజుల్లో వినోదం కోసం మాట్లాడినా వివాదానికే జనం ఆసక్తి చూపిస్తున్నారని చురకలు వేశారు. కాగా నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవీ చైతన్య(Vasishnavi Chaithanya).. ఆ డైరెక్టర్- ప్రొడ్యూసర్ ను ఇబ్బంది పెట్టిందని, సదరు వ్యాఖ్యలు తన గురించేనని నెట్టింట్లో చర్చ నడుస్తోంది. ఇక ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలోకి రానుంది. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందింది.
Read More : తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు బాగా అర్థమైంది.. దుమారం రేపుతున్న నిర్మాత కామెంట్స్