‘భాఘీ-4’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. వైల్డ్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మూవీ మేకర్స్

by Hamsa |
‘భాఘీ-4’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. వైల్డ్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాఘీ-4’(Baaghi-4). ఎ హర్ష (Harsha)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ‘భాఘీ-3’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతుంది. అయితే ఇందులో హర్నాజ్ సంధు(Harnaaz Sandhu) హీరోయిన్‌గా కనిపంచనుండగా.. దీనిని సాజిద్ నదియాద్వాలా(Sajid Nadiadwala) ఫ్రాంచీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్(Sanjay Dutt), సోనమ్ బజ్వా(Sonam Bajwa) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్లు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, టైగర్ ష్రాఫ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ‘భాఘీ-4’ విడుదల తేదీని ప్రకటించారు.

అంతేకాకుండా ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ.. టైగర్ ష్రాఫ్ సిగరెట్ తాగుతూ రక్తంతో వైల్డ్ లుక్‌లో ఉన్న పిక్ షేర్ చేశారు. అలాగే ‘‘ఈ సారి ఆయన సేమ్ కాదు మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో అంచనాలను పెంచడంతో పాటు క్యూరియాసిటీని కలిగిస్తోంది. కాగా, టైగర్ ష్రాఫ్ , శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) జంటగా నటించిన ‘భాఘీ’ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2018లో దీనికి సీక్వెల్‌గా ‘భాఘీ-2’ వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక 2020లో మరోసారి టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ కాంబోలో వచ్చిన ‘భాఘీ-3’ చిత్రం కూడా హిట్‌గా నిలవడంతో.. దీనికి సీక్వెల్‌ తీసుకురాబోతున్నారు మూవీ మేకర్స్.

Next Story

Most Viewed