- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ashika Ranganath: సముద్రంపై అషికా రంగనాథ్ సాహసం.. షాకింగ్ పోస్ట్ వైరల్

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్(Ashika Ranganath) ఇటీవల ‘నా సామి రంగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఆడియన్స్‌కు దగ్గరవుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’(Vishvambhara) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. అయితే అషికా, సిద్ధార్థ్ జంటగా నటించిన ‘మిస్ యు’ (Miss you)మూవీ డిసెంబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ క్రమంలో ఆమె ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ వరుస పోస్టులు షేర్ చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటోంది. తాజాగా, అషికా రంగనాథ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా పలు వీడియోలు షేర్ చేసింది. అందులో సముద్రంపై సాహసం చేస్తూ కనిపించింది. ఈ పోస్ట్‌కు ఆమె ‘‘మీరు పని నుండి ఒక రోజు సెలవు పొంది సరదాగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు.. అద్భుతమైన క్షణాలను చూడటానికి ఎడమవైపుకు స్వైప్ చేయండి! మేము మొదటిసారి సర్ఫింగ్ చేశాము.
ఇది చాలా సరదాగా, ఉల్లాసంగా ఉంది. మొదటి ప్రయత్నంలోనే ఇంత బాగా రాణించగలమని అనుకోలేదు. మూర్తి సర్ఫీ స్కూల్ నుండి వచ్చి నేర్పిన మా కోచ్‌లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎలాంటి కొత్త సాహసం, అనుభవాన్ని ప్రయత్నించడానికి అనూష రంగనాథ్ అనే ఉత్తమ భాగస్వామిని కలిగి ఉన్నాను’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆమెలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అంటున్నారు.