- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రప్రదేశ్‌లోని ఆ బీర్లే రాకేష్ మాస్టర్ మరణానికి కారణామా..? డాక్టర్లు చెబుతోంది ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో డాన్స్ కొరియో గ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన హఠాత్మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. అయితే.. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం ఉదయం రక్త విరేచనాలు కావడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు రాకేష్ మాస్టర్. ఆయనకు సివియర్ మెటబోలిక్ అసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
కానీ, ఆయన మరణానికి మద్యం అలవాటే కారణమంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో దొరికే భూమ్ భూమ్ బీర్లే ఆయన ప్రాణాన్ని తీశాయంటూ వార్తలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. గతంలో ఆయన బీర్లు సేవిస్తున్నప్పటి వీడియోలు షేర్ చేస్తూ ఈ బీర్ల కారణంగానే రాకేష్ మాస్టర్ చనిపోయారంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు కొంతమంది. కానీ, అతని అభిమానులు మాత్రం మద్యం కారణంగా కాదు అనారోగ్య సమస్యతోనే మాస్టర్ చనిపోయారని గట్టిగా నమ్ముతున్నారు.
Also Read...
Rakesh Master చనిపోతాడని రెండు నెలల ముందే తెలుసా.. బయటపడ్డ నిజం