Anupama Parameswaran: ముఖంపై గాయాలతో అనుపమ.. ఆందోళనలో అభిమానులు (పోస్ట్)

by Hamsa |
Anupama Parameswaran: ముఖంపై గాయాలతో అనుపమ.. ఆందోళనలో అభిమానులు (పోస్ట్)
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ‘శతమానం భవతి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇటీవల అనుపమ ‘టిల్లు స్వ్కేర్’(Tillu Square)తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పరదా(parada), బైసన్ వంటి సినిమాల్లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

తాజాగా, అనుపమ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. కొన్ని ఫొటోలు షేర్ చేయగా.. ఆమె ముఖంలో గాయాలు కనిపించాయి. దీంతో సడెన్‌గా చూసిన నెటిజన్లు అనుపమకు ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే అవి ఓ సినిమాకు సంబంధించిన ఫొటోలని తెలుస్తోంది. కానీ ఏ మూవీలో నటిస్తుందో మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం అనుపమ పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story