- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: "దమ్ముంటే పట్టుకోరా షికావత్.. " పాట రిలీజ్.. ఏం టైమింగ్ రా అయ్యా అంటూ నెటిజన్స్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలం నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకటి పోతుందనుకుంటే .. ఇంకోటి రెడీ అవుతుంది. రాజ్ తరుణ్, జానీ మాస్టర్, హర్ష సాయి, మొన్నటికి మొన్న మోహన్ బాబు ఇంటి గొడవలు ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 ఘటన.ఈ మూవీ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని శనివారం అసెంబ్లీలో కూడా దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినీ ఇండస్ట్రీపై మండిపడ్డారు.
దమ్ముంటే పట్టుకోరా షికావత్ .. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అనే పాట పుష్ప 2 ( Pushpa 2) మూవీలో ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే, ప్రముఖ యూట్యూబ్ సంస్థ టీ సిరీస్ తెలుగులో ఈ వాయిస్ సాంగ్ ని విడుదల చేశారు. రిలీజ్ చేసిన కొంత సమయంలోనే తెగ వైరల్ అయింది. ఒక వైపు నేడు అల్లు అర్జున్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందా అని రెండు రాష్ట్రాల బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. టైమే బాగాలేని సమయంలో ఇప్పుడు ఈ పాట వదలడం ఏంటని చాలా మంది షాక్ అవుతున్నారు.
పాటను వింటూ కొందరూ ఎంజాయ్ చేస్తూ ఏం టైమింగ్ రా అయ్యా, అసలు తగ్గేదేలే కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేసాడు, ఈ పాట కోసం వెయిట్ చేసినట్టు దేనికి వెయిట్ చేయలేదు రా బాబు.. అయిన భలే కరెక్ట్ టైం కి దింపావ్ లే, పాట మాత్రం నెక్స్ట్ లెవెల్, ఈ పాట వేరే లెవెల్ భయ్యా, సాంగ్ ఆఫ్ ది ఇయర్ , న్యూ ఇయర్ కి ఇదే ట్రెండింగ్, నా రింగ్ టోన్ కూడా ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read More...
Pushpa-2: ‘పుష్ప-2’ ఎఫెక్ట్.. ఇండస్ట్రీలో మొదలైన కొత్త టెన్షన్‌లు!