- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: స్టేజి మీదకు దూసుకొచ్చిన అభిమాని.. పిలిచి మరి ఫోటో ఇచ్చిన అల్లు అర్జున్
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప 2. దేశవ్యాప్తంగా ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఆల్ ఏరియాస్ లో ప్రమోషన్స్ చేశారు. తాజాగా, సోమవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అయితే, ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుని స్టేజిపైకి దూసుకొచ్చాడు.
అయితే, వెంటనే అక్కడున్న బౌన్సర్లు అతనిని వెనక్కి లాగేస్తుండగా, అతను ఒక్క ఫోటో ఇవ్వు అన్న, ఒక్క ఫోటో ఇవ్వు అన్న అని గట్టి గట్టిగ అరుస్తుండటంతో బన్నీ అతని దగ్గరికి వచ్చి బౌన్సర్లు ని వదిలేయమని చెప్పి అతనికి ఫోటో ఇచ్చాడు. దీంతో అతను హ్యాపీగా జై బన్నీ.. జై జై బన్నీ అనుకుంటూ వెళ్ళాడు.
అతను దిగిపోయిన తర్వాత బన్నీ మాట్లాడుతూ.. " ఐ లవ్ మై ఫ్యాన్స్ ..నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం.. పిచ్చి అబ్బా. లవ్ యూ లవ్ యూ అంటూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. కానీ, ఇలాంటివి మళ్ళీ చేయకండి ప్లీజ్.. " అని అన్నాడు. దీంతో ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది.