- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎవరికీ తెలియని సీక్రెట్.. చిరంజీవి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఎవరిదో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది టాటూలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఒకప్పుడు పచ్చబొట్టు వల్ల తట్టుకోలేని బాధ ఏర్పడుతుందని చాలా మంది వెనకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి కావడంతో కొన్ని మిషన్స్ వచ్చి పచ్చబొట్టు వల్ల ఎక్కువగా నొప్పి రాకుండా ఉంటుంది. దీంతో అందరూ తమకు నచ్చిన వారి పేరు లేదా ఏదైనా గుర్తునో శరీరంపై పొడిపించుకుంటున్నారు. సాధారమైన వారే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు సైతం రెండు, మూడు టాటూలు వేసుకుంటున్నారు. తమకు ఇష్టమైన వారి కోసం ఎంత నొప్పిని అయినా భరించి ప్రేమగా టాటూ వేయించుకుని పార్ట్‌నర్‌ని లేదా తల్లిదండ్రులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు.
కొందరైతే మరీ దారుణంగా శరీరం మొత్తం పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు వార్తల్లో వస్తూనే ఉంటాయి. అయితే ఇదే లిస్టులో మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చేశాడట. చిరంజీవి కూడా కొద్ది రోజుల క్రితమే పచ్చబొట్టు వేయించుకున్నాడని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే అది చిరంజీవి భార్య పేరు కాదట. తన అమ్మ అంజనా దేవి పేరులో అమ్మ కలిసేలా అంజమ్మాగా వేసుకున్నాడని తెలుస్తోంది. ఈ పచ్చ బొట్టు చిరంజీవి చేతి బ్యాక్ సైడ్ ఉంటుందట. ఇది ఫొటోగ్రఫీలో పడకపోవడం వల్ల ఎక్కువ మందికి తెలియదు. ఇక ఈ విషయం తెలిసిన వారు అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారని ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లిదండ్రులను గౌరవించిన వాళ్లే గొప్ప స్థాయిలో ఉంటారని చిరంజీవి నిరూపించాడని అంటున్నారు.
Read More..
- Tags
- Chiranjeevi