భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న బోల్డ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Kavitha |
భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న బోల్డ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: ‘బాణం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ బ్యూటీ వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫేమ్ తెచ్చుకుంది. కానీ మధ్యలో కొన్నాళ్లు సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం ‘ఫియర్’ అనే మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 14న థియేటర్లలోకి రానుంది.

ఇదిలా ఉంటే.. ఓ పక్కా వరుస సినిమాలు చేస్తూ.. మరో పక్కా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఇలా బోల్డ్ షోలతో పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది. ఎటువంటి ప్లాన్ లేకుండానే శ్రీ కాళహస్తి దేవస్థానం దర్శనం అయిందని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Advertisement

Next Story