ఒక్క అవకాశం కోసం 5 మంది.. భరించలేకపోయా.. యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్

by Kavitha |
ఒక్క అవకాశం కోసం 5 మంది.. భరించలేకపోయా.. యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ యంగ్ బ్యూటీ శృతి హరిహరన్ (Sruthi Hariharan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు 2012లో విడుదలైన ‘సినిమా కంపెనీ’(Cinema Company) అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘దయోతిరి’, ‘సావరీ 2’, ‘లూసియా’ వంటి కన్నడ చిత్రాలలో కూడా నటించింది. అంతేకాదు తమిళంలో ‘నిల’, ‘నెరుంగి వా ముత్త మీదతే’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఈమె ప్రముఖ హీరో అర్జున్ సర్జా పై కేసు పెట్టిన విషయం అప్పట్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తనను అర్జున్ సర్జా కౌగిలించుకున్నాడనే వివాదానికి తెరలేపింది. దీనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా.. అర్జున్ సర్జ (Arjun sarja)పై చేసిన ఫిర్యాదుకు సరైన సాక్షాధారాలు లేకపోవడంతో కోర్టు ఈ కేసును కొట్టి పారేసింది. ఇదిలా ఉంటే.. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి చాలా మంది నటీమణులు తాము కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామని, అవకాశాల పేరిట అత్యాచారానికి కూడా గురవుతున్నామంటూ విస్తుపోయే నిజాలను బయట పెట్టారు. ఈ క్రమంలో యంగ్ బ్యూటీ శృతి హరిహరన్ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఏకంగా 5 మంది తమిళ నిర్మాతలు తన కోసం వల విసిరారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ బ్యూటీ.. క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలను వెల్లడించింది. గతంలో శృతి చేసిన కామెంట్లు జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో మళ్లీ వైరల్‌గా మారాయి. శృతి మాట్లాడుతూ.. “నేను నటించిన తొలి కన్నడ సినిమాకి జరిగిన సమావేశం నన్ను మరింత భయపెట్టింది. నా వయస్సు అప్పుడు 18 సంవత్సరాలు మాత్రమే. కాస్టింగ్ కౌచ్ షాక్‌తో నేను విపరీతంగా భయపడిపోయాను. ఈ విషయాన్ని నా డాన్స్ కొరియోగ్రాఫర్‌కి చెబితే.. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే దాని గురించి ఆలోచించడం వదిలేయండి అని చెప్పారు. అయితే సరిగ్గా ఈ ఘటన జరిగిన నాలుగేళ్లకు ఇదే సినిమా హక్కులను తమిళ్ ఇండస్ట్రీ వారు తీసుకున్నారు. అందులో కూడా నాకు సేమ్ పాత్ర ఇస్తానని చెప్పారు. అయితే ఆ సినిమాకు ఐదుగురు నిర్మాతలు కావడంతో.. ఆ ఐదుగురికి కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారు. ఆ సమయంలో నేను ఏం చెప్పాలో తెలియక నా చేతిలో చెప్పులు లేవు అంటూ గట్టిగా అరిచి అక్కడి నుంచి వచ్చేసాను. ఫలితంగా నాకు తమిళ్ నుంచి సినిమా అవకాశాలు రాలేదు” అంటూ చెప్పుకొచ్చింది శృతి హరిహరన్. ప్రస్తుతం శృతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More :

రంగురంగుల ప్రపంచంలో చీకటి కోణాలు ఎన్నో? తారలుగా వెలగాలంటే బెడ్ పై నలగాల్సిందేనా?

Advertisement

Next Story

Most Viewed