అనుమతులొచ్చినా.. బొమ్మపడలే!

by Anukaran |
అనుమతులొచ్చినా.. బొమ్మపడలే!
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో థియేటర్లు, మల్టిప్లెక్స్‌ల రీఓపెనింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దాని ప్రకారం ఇవాళ్టి నుంచి థియేటర్లు తెరచుకోవాలి. కానీ, థియేటర్ల యాజమాన్యాలు సినిమా హాళ్ల రీఓపెనింగ్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాంతో మార్నింగ్ షో బొమ్మ పడలేదు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో థియేటర్లు ఓపెన్ చేసినా ప్రేక్షకులు వస్తారా లేదా అన్న సందిగ్ధంలో వారు ఉన్నట్లు సమాచారం. దీంతో వచ్చేనెల 4వ తేదీ నుంచి థియేటర్లు తెరవాలని యజమానులు భావిస్తున్నట్లు టాక్. అంతేకాకుండా ప్రస్తుతం కొత్త సినిమాల విడుదలకు కొంత సమయం పడుతుందని నిర్మాతలు చెప్పారట. దానికి తోడు టికెట్ ధరలపై పెంపుపై థియేటర్ల సంఘాలు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ రూల్స్ పాటిస్తూ 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు నడపాలంటే అధిక భారం పడుతుందని యజమానులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లులు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పలు రకాల కారణాలతో థియేటర్ల తెరుచుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed